గజ్వేల్, జూన్ 7: సీఎం రేవంత్‌రెడ్డి తన స్థాయిని తగ్గించుకొని నిరాధారణమైన మా టలు మాట్లాడవద్దని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి హితవు పలికారు. శుక్రవారం గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..సిద్దిపేటలో బీఆర్ఎస్ ఓట్లను బీజేపీకి డైవర్ట్ చేశారని మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి, మహబూబ్‌నగర్, మల్కాజిగిరిలో కాంగ్రెస్ ఓట్లను బీజేపీకి డైవర్ట్ చేశారా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, మాట్లాడే ముందు తామేమీ చేశా మో గుర్తు చేసుకోవాలన్నారు.
ఏపీ ప్రజలు చంద్రబాబుకు ఇచ్చిన తీర్పును, తెలంగాణ ప్రజలు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతిస్తే ఢిల్లీలో కేసీఆరే కీలకం అయ్యేవారన్నారు. ఎల్లప్పుడు రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడుతామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గజ్వేల్ అభివృద్ధిని అడ్డుకోవద్దని, పెండింగ్‌లో ఉన్న రూ.200కోట్ల నిధులు ఇవ్వడంతోపాటు రింగ్‌రోడ్డు, బస్టాండ్లు, రేడియల్ రోడ్లు, యూజీడీ పనులు పూర్తికి నిధులి ఇవ్వాలని కోరారు. తాము అధికారం ఉన్నా లేకున్నా ప్రజలతోనే ఉంటామన్నారు.
రైతాంగం కోసం మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులను నింపాలని, వెంటనే రైతు భరోసా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో గజ్వేల్ ప్రజలు అభివృద్ధ్ది, సంక్షేమానికి మద్దతిచ్చారని వారికి వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రత్యే క కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో జడ్పీటీసీ మల్లేశం, వైస్ చైర్మన్ జకీయొద్ద్దీన్, కౌన్సిలర్ గోపాల్‌రెడ్డి, శ్రీనివాస్, మెట్టయ్య, చం దు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నవాజ్‌మీరా, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, బొల్లారం ఎల్లయ్య, నర్సింగరావు, విరాసత్‌అలీ, భూపాల్‌రెడ్డి, పొన్నాల కుమా ర్ తదితరులు పాల్గొన్నారు.