మైనంపల్లి హన్మంతరావు వంద కార్లతో వస్తే భయపడే వారు ఎవరూ లేరని, నీవు పోరాటం చేయాల్సింది సీఎం రేవంత్‌రెడ్డిపై అన్నారు. కేసీఆర్ మెదక్‌కు మెడికల్ కళాశాల, రింగ్‌రోడ్డుతో పాటు అభివృద్ధి పనులకు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తే రేవంత్‌రెడ్డి వాటన్నింటినీ రద్దు చేశారని.. మెదక్ ఎమ్మెల్యేగా ఉన్న నీ కొడుకు రోహిత్, నువ్వు రేవంత్‌రెడ్డిపై పోరాటం చేయాలన్నారు. మెడికల్ కళాశాలను కొడంగల్‌కు తరలించుకుపోతే అడిగే దిక్కు లేదన్నారు.
రైతు రుణమాఫీని డైవర్ట్ చేసేందుకు మంత్రి పదవి కోసం మైనంపల్లి ఆడుతున్న హైడ్రామా అన్నారు. సిద్దిపేట గడ్డ తెలంగాణను తీసుకవచ్చిన గడ్డ అన్నారు. వేల ఎకరాలకు సాగు నీరందించిన ఘనత కేసీఆర్, హరీశ్‌రావులది అన్నారు. ప్రాజెక్టులకు కాళేశ్వరం నుంచి నీళ్లు వదలాలని హరీశ్‌రావు గట్టిగా నిలదీస్తేనే నేడు ప్రాజెక్టులకు నీళ్లు వదులుతున్నారన్నారు. 50 శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదని మంత్రులు అంటున్నారన్నారు. ఎవరు చెప్పే మాట నిజమని ప్రతాప్‌రెడ్డి ప్రశ్నించారు.