గజ్వేల్, ఆగస్టు 16: ఏకకాలంలో రైతులకు పంట రుణాలు మాఫీ చేస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి మాటమార్చి కేవలం 22లక్షల మందికే రుణమాఫీ చేసి ఏదో సాధించినట్లు హరీశ్‌రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం సిగ్గుచేటని, మిగతా 25 లక్షల మంది రైతుల రుణమాఫీ చేయడంలోపాటు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తే తప్పకుండా హరీశ్‌రావు రాజీనామాకు సిద్ధమని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నా రు. శుక్రవారం గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 47లక్షల మంది రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని దేవుళ్లపై ప్రమాణాలు చేసి సీఎం మాట తప్పారన్నారు.
రాష్ట్ర వ్యా ప్తంగా కేవలం 22లక్షల మందికి రూ.17 వేల కోట్ల రుణమాఫీ 47శాతం మాత్రమే చేశారని, మిగతా రైతుల ప్రతిరోజు బ్యాంకులు, తహసీల్ కార్యాలయాలు, వ్యవసాయాధికారుల వద్దకు తిరుగుతున్నారని తెలిపారు. నీతి, నిజాయి తీ లేని నాయకులు హరీశ్‌రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం సిగ్గుచేటన్నారు. సీఎం ఉత్తర ప్రగాల్భాలు పలుకుతూ హామీలపై దృష్టి సారించడం లేదన్నా రు. సీతారామ ప్రాజెక్టుకు రూ. 7500కోట్లు ఖర్చు చేశామని చెప్పడంలో అర్థంలేదన్నారు. కౌలు రైతులకు రూ.15వేలు ఇస్తామన్న రేవంత్‌రెడ్డి అసలు రైతులకే నేటికి ఇచ్చిన హామీల్లో ఒక్కటి దిక్కు లేదన్నారు. కాంగ్రెస్ సర్కారు రైతుభరోసా డబ్బులను రైతు రుణమాఫీకి మళ్లించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తం గా భూముల ధరలు తగ్గడంలో గ్రామాలు, పట్టణా ల్లో వ్యాపారం కుంటిపడిందని, రాష్ట్రం దివాళా తీసిందన్నారు.
ఊకడంపుడు మాటలతో పబ్బం గడుపుతున్నరన్నారు. రుణమాఫీ కాని రైతులను బీఆర్ఎస్ నాయకలు, కార్యకర్తలు కలుస్తారని, త్వరలోనే గజ్వేల్‌లో భారీ బహిరంగ సభను కేసీఆర్ నాయకత్వంలో ఏర్పాలు చేస్తామన్నారు. రేప టి నుంచి గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్ర 5 వరకు రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించి రైతుల న్యాయం చేసేలా కృషి చేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని ప్రచారం చేసిన కాంగ్రెస్ నాయకులకు పారుతున్న గోదావరి జలా లు కనిపించడం లేదన్నారు. తక్షణమే కూడవెళ్లి, హ ల్దీ వాగులోకి నీళ్లను వదిలి రైతులను ఆదుకోవాలన్నా రు.
గజ్వేల్ నుంచి ఇరిగేషన్, ఆర్అండ్బీ ఈఈ, పంచాయతీరాజ్ ఈఈ కార్యాలయాలను కొడంగల్‌కు తరలించే ప్రయత్నాలను ఉపసంహరించుకోవాలన్నారు. రూ.170 కోట్ల నిధులను ప్రభుత్వం వెనక్కి తీసుకెళ్లిందని, దమ్ముంటే స్థానిక కాంగ్రెస్ నాయకులు వాటిని తిరి గి తీసుకొచ్చి గజ్వేల్ అభివృద్ధికి ఖర్చుచేసేలా ప్రభుత్వంపై పోరా టం చేయాలన్నారు. ఇక్కడి కాంగ్రెస్ నేతలకు కా ర్యాలయాలు తరలుతున్నా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రా జమౌళి, మండల పార్టీ అధ్యక్షుడు బెండే మధు, పట్టణ అధ్యక్షుడు నవాజ్‌మీరా, కౌన్సిలర్లు అల్వాల బాలేశ్, అత్తెల్లి శ్రీనివాస్, నాయకులు గుంటుక రాజు, రవీందర్, నర్సింగరావు, దుర్గాప్రసాద్, స్వామిచారి, ఉమార్, మల్లేశం పాల్గొన్నారు.