Tella Kanki | కొల్చారం, మార్చి 25 : వరిలో తెల్ల కంకి నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని కౌడిపల్లి ఏడిఏ ఫుణ్యవతి, మండల వ్యవసాయ అధికారి శ్వేతాకుమారి అన్నారు. క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా వారు ఇవాళ కొల్చారం మండల పరిధిలోని వరిగుంతం గ్రామంలో పర్యటించి వరి పంటను పరిశీలించారు. వరి కంకి బయల్పడుతున్న దశలో వరిలో తెల్ల కంకులు రావడాన్ని గమనించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వరిలో మొగి పురుగు రావడం మూలంగా ఈ విధంగా తెల్ల కంకులు వస్తాయన్నారు. దీని నివారణకు వరి చిరు పొట్ట దశలో ఉన్నప్పుడు ఎకరాకు 60 గ్రాముల చొప్పున క్లోరంత్రానిప్రోల్ రసాయనాన్ని పిచికారి చేయాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు, రైతులు ఉన్నారు.
Read Also |
Eknath Shinde | కమ్రా సుపారి తీసుకున్నట్లుంది.. కమెడియన్ వ్యాఖ్యలపై స్పందించిన ఏక్నాథ్ షిండే
Encounter | ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్కౌంటర్.. భద్రతాదళాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి
Bangladesh | మహమ్మద్ యూనస్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు..? త్వరలో బంగ్లాలో సైనిక పాలన..?