Edupayala Temple | పాపన్నపేట, ఆగస్టు 16 : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గామాత ఆలయం ఇంకా జలదిగ్బంధంలోనే ఉంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు తోడు సింగూర్ ప్రాజెక్టు నుండి ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదలడంతో వనదుర్గ ప్రాజెక్ట్ నిండుకొని పొంగిపొర్లుతుంది. దీంతో దుర్గామాత ఆలయం ముందు నుండి పెద్ద ఎత్తున మంజీరా ప్రవహిస్తుంది. దీంతో గత రెండు రోజుల క్రితం దుర్గామాత ఆలయం మూసివేశారు. ఆలయం వైపు పెద్ద ఎత్తున మంజీరా పరవళ్లు తొక్కుతుండడంతో అటువైపు ఎవరు వెళ్లకుండా పోలీసులు భారీకేడ్లు ఏర్పాటు చేశారు.
దుర్గామాతకు రాజగోపురంలో పూజలు నిర్వహిస్తున్నారు. మంజీరా పెద్ద ఎత్తున పరవళ్లు తొక్కుతుండడంతో ఈ అపురూప దృశ్యాన్ని తిలకించడానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇదిలా ఉండగా శనివారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఏడుపాయలకు చేరుకొని ఘనపూర్ ఆనకట్ట నీటి ఉధృతిని పరిశీలించారు. అనంతరం ఆలయం వద్ద తగిన బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్‌కు సూచించారు.
ఆలయం వైపు ఎవరు వెళ్లకుండా చూడాలని పోలీసులు, అధికారులను ఆదేశించారు. మంజీరా ఉధృతికి సంబంధించిన వివరాలను పాపన్నపేట తహసీల్దార్ సతీష్ ను అడిగి తెలుసుకున్నారు. మంజీరా ఉధృతి తగ్గిన తర్వాత ఆలయాన్ని పునః ప్రారంభిస్తామని ఈ సందర్భంగా ఆలయ ఈవో చంద్రశేఖర్ వెల్లడించారు.
Aamir Khan | ‘కూలీ’ సినిమాకు రూ.20 కోట్ల రెమ్యూనరేషన్.. క్లారిటీ ఇచ్చిన ఆమిర్ ఖాన్
Javed Akhtar | దేశద్రోహి అన్న నెటిజన్.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జావేద్ అక్తర్
Kangana Ranaut | ఆడవాళ్లనే తప్పుగా చూస్తారు.. పెళ్ళైన వారితో రిలేషన్‌పై కంగనా కామెంట్స్