Aamir Khan Coolie Remuneration | సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కూలీలో బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే. ఈ మూవీలో దాహా అనే డాన్ పాత్రలో ఆమిర్ కనిపించాడు. అయితే ఈ సినిమా కోసం ఆమిర్ ఏకంగా రూ.20 కోట్లు తీసుకున్నాడంటూ పలు మీడియాలలో వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించాడు ఆమిర్. కూలీ సినిమాకు రూ. 20 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. కూలీ సినిమా కోసం తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఆమిర్ తెలిపారు.
తలైవర్పై ఉన్న ప్రేమని డబ్బులతో వెలకట్టలేను. రజనీకాంత్ మరియు కూలీ టీమ్ పట్ల ఉన్న ప్రేమ, గౌరవం కారణంగానే తాను ఈ సినిమాలో ఎటువంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించానని.. దర్శకుడు లోకేష్ కనగరాజ్ వచ్చి కథ చెప్పకుండానే తాను ఈ ప్రాజెక్టుకు అంగీకరించానని, ఇలా స్క్రిప్ట్ వినకుండా ఒక సినిమాకు ఓకే చెప్పడం తన కెరీర్లో ఇదే తొలిసారని ఆమిర్ అన్నారు. ఈ సినిమాలో నేను కేవలం అతిథి పాత్రలో మాత్రమే నటించాను. కానీ అసలైన హీరోలు రజనీకాంత్, నాగార్జుననే. వారిని చూసేందుకే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారంటూ ఆమిర్ చెప్పుకోచ్చాడు.