Javed Akhtar | బాలీవుడ్ దిగ్గజ లిరిక్ రైటర్ జావేద్ అక్తర్ ఇండిపెండెన్స్ డే రోజున ఇద్దరు నెటిజన్లకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. భారత ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ జావేద్ అక్తర్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు. అయితే ఈ పోస్ట్‌పై ఒక నెటిజన్ స్పందిస్తూ.. మీ స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 14(పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవ రోజు) కదా.. అంటూ రిప్లయ్ ఇచ్చాడు. దీనికి జావేద్ అక్తర్ స్పందిస్తూ..
బాబు. మీ తాతా, నాన్న ఆంగ్లేయుల చెప్పుల కింద బానిసలుగా ఉన్నప్పుడు నా పూర్వీకులు స్వాతంత్ర్యం కోసం బ్రిటీష్ వారితో పోరాడి కాలాపానీ జైలు(అండమాన్ సెల్యూలార్)లో మరణించారు. నీ హద్దుల్లో నువ్వు ఉండూ అంటూ జావేద్ అక్తర్ రాసుకోచ్చాడు. దీనికి ఒక నెటిజన్ స్పందిస్తూ.. కానీ, నువ్వు దేశద్రోహివే అంటూ కామెంట్ చేశాడు.
దీనిపై జావేద్ స్పందిస్తూ.. సహాయ నిరాకరణ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమాలను వ్యతిరేకించిన వారే(ఆర్ఎస్ఎస్) దేశద్రోహులు. ఆంగ్లేయులకు చేతనైనంత సహాయం చేసిన వారే దేశద్రోహులు. మన రాజ్యాంగాన్ని, త్రివర్ణ పతాకాన్ని వ్యతిరేకించిన వారే దేశద్రోహులు. వాళ్లెవరో తెలుసుకుని నీ అజ్ఞానాన్ని కొద్దిగా తగ్గించుకో. అంటూ జావేద్ అతడికి కౌంటర్ రిప్లయ్ ఇచ్చాడు.
Beta jab tumhare baap dada angrez ke joote chaat rahe thay mere buzurg desh ki aazadi ke liye kaala pani mein mar rahe thay . Apni auqat mein raho .
— Javed Akhtar (@Javedakhtarjadu) August 15, 2025
Gaddaar voh hain jo non cooperation aur quit India movement ke khilaf thay . Gaddar voh hain jinhon ne jitna hosaka angrez ki madad ki . Gaddaar voh hain jo humaray somvidhan aur tirangay ke khilaf thay . Yeh pata laga kar voh kaun thay apni jihaalet thodi si kum karlo
— Javed Akhtar (@Javedakhtarjadu) August 16, 2025