Kangana Ranaut | ఆడవాళ్లనే తప్పుగా చూస్తారు.. పెళ్ళైన వారితో రిలేషన్‌పై కంగనా కామెంట్స్
Kangana Ranaut | పెండ్లి అయిన మగాళ్లనే తాను ఎప్పుడు టార్గెట్ చేస్తానని వస్తున్న విమర్శలపై తాజాగా స్పందించింది బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్.
Kangana Ranaut on Dating Apps | పెండ్లి అయిన మగాళ్లనే తాను ఎప్పుడు టార్గెట్ చేస్తానని వస్తున్న విమర్శలపై తాజాగా స్పందించింది బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్. ఏదైనా సాధించాలనే పట్టుదల ఉండి సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలనే మహిళల మీదనే ఇలాంటి కామెంట్లు వస్తాయని తెలిపింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న కంగనా తన పర్సనల్ లైఫ్‌తో పాటు ఇప్పుడున్న డేటింగ్ పోకడల గురించి తన అభిప్రాయాలను వెల్లడించింది.
అమ్మాయిలు వయసులో ఉండి ఏదైనా సాధించాలనే పట్టుదలతో ఉన్నప్పుడు ఒక పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న వ్యక్తి మీతో సంబంధం పెట్టుకోవాలని ప్రయత్నిస్తే అది మగవాడి తప్పు కాదు. మీరు పెళ్ళి అయిన వాళ్ళతో సంబంధం పెట్టుకోవడం మీ తప్పు అని జనాలు ఎప్పుడూ మహిళను తప్పుగా చూస్తారు. ఇలాంటి సందర్భాల్లో అమ్మాయి తప్పు చేసినట్లే, మగవాడి తప్పు చేశాడు అని ఎవరు అనుకోరంటూ కంగనా అభిప్రాయపడింది.
అలాగే డేటింగ్ యాప్స్ వాడకం గురించి కంగనా మాట్లాడుతూ.. ఇవి సమాజంలో మురికి కాలువ లాంటివని.. ఆత్మవిశ్వాసం లేనివారు, ఎవరో ఒకరి గుర్తింపు కోసం చూసేవాళ్లు మాత్రమే ఇలాంటివి వాడుతారని కంగాన చెప్పుకోచ్చింది. పెద్దలు కుదిర్చిన వివాహాం ద్వారా అయిన లేదా చదువుకున్న టైంలో అయిన అమ్మాయిలు తమ పార్ట్నర్లను వెతుక్కోవాలని కంగనా సూచించింది. అలాగే లివ్-ఇన్ రిలేషన్లు అమ్మాయిలకు సురక్షితం కాదని కంగనా చెప్పుకోచ్చింది. ఇలాంటి రిలేషన్లో అమ్మాయిలకు గర్భం వస్తే కుటుంబం నుంచి సరైన తోడు ఉండదని చెప్పుకోచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

