 
                                                            చౌటకూర్, అక్టోబరు 30: సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతున్నది. మొంథా తుఫాన్ కారణంగా మూడు రోజులుగా వర్షాలు కురువడంతో గురువారం సింగూరు ప్రాజెక్టు మరో రెండు క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలినట్లు ప్రాజెక్టు డీఈఈ నాగరాజు, ఏఈ మహిపాల్ రెడ్డి తెలిపారు.
గురువారం ప్రాజెక్టులోకి 21,935 క్యూసెకు ఇన్ఫ్లో ఇన్ఫ్లో వచ్చిందన్నారు. మూడు క్రస్ట్ గేట్ల ద్వారా 23,918 క్యూసెకులు, జల విద్యుత్ ఉత్పత్తి గేట్ ద్వారా 2,395 క్యూసెకులు, మొత్తం ఔట్ ఫ్లో 26,313 క్యూసెకులు నమోదైంది.
 
                            