సిర్గాపూర్, జూలై 31: సంగారెడ్డి జిల్లా నల్లవాగు మధ్యతరహా ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి 1138 క్యూసెక్కుల వరద వస్తున్నదని సంబంధిత ఏఈఈ శ్రీవర్ధన్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1493 అడుగులు కాగా ప్రస్తుతం 1487 అడుగుల వద్దకు జలాలు ఉన్నాయన్నారు. ఇలాగే వర్షాలు కురిస్తే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి అలుగు పారే అవకాశం ఉందని ఆయన తెలిపారు.