పుల్కల్, జూలై 27 : రెండు రోజులుగా ఎగు వ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టులోకి శనివారం రాత్రి వరకు వరద పెరిగింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29. 917 టీఎంసీలు ఉండగా ఇందులో ప్రస్తు తం 14.157 టీఎంసీల నిల్వ ఉన్నది.
ప్రాజెక్టులోకి వరద రూపంలో వస్తున్న నీరు 2497 క్యూసెక్కులు, అవుట్ప్లో 391 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది. అందులో తాలెల్మ ఎత్తుపోతల పథకానికి 41క్యూసె క్యులు, హైదరాబాద్ తాగునీటి సరఫరాకు 80 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 70 క్యూసెక్కులు, వృథాగా 200 క్యూసెక్కుల నీరు వెళ్తున్నట్లు ఏఈ మహిపాల్ తెలిపారు.