పుల్కల్, అక్టోబర్ 5: సంగారెడ్డి జిల్లా పుల్క ల్ మండలంలోని బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు శనివారం వరద కొనసాగడంతో రెండు గేట్లు ఎత్తి దిగువకు 16,284 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. విద్యుదుత్పత్తి కోసం జెన్కోకు 2823 క్యూసెక్కులు విడుదల చేశారు.
14168 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో , 19107 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఏఈ మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు రాగా, 29.678 టీఎంసీల నీరు ఉన్నట్లు తెలిపారు.