అమీన్పూర్, నవంబర్ 14: అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద చెరువు కట్టపై ముంపు బాధితులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. 5000 ప్లాట్లు 20 లేఅవుట్లు 40 ఏండ్ల క్రితం క్లియర్ పట్టాలో ఉన్నాయన్నారు. కొంతకాలం తర్వాత మా ప్లాట్లన్నీ మురుగునీటితో నిండిపోయాయన్నారు. ఇందులో ఇరిగేషన్ అధికారుల అలసత్వం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
తక్షణమే మా ప్లాట్లలో ఉన్న నీటిని తొలిగించి, ఇంటి నిర్మాణాలకు సహకరించాలని ఈ సందర్భంగా జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపాలిటీ కార్యాలయానికి వెళ్లి ఆర్వో మధుసూదన్‌రెడ్డికి మెమోరాండం అందచేశారు. 15 రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను సైతం కలిసి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు, ముంపు బాధితులు పాల్గొన్నారు.