Mrigasira Karthi | మెదక్ రూరల్ జూన్ 8: రుతుపవనాల ప్రారంభాన్ని, వేసవి గరిష్ట ఉష్ణోగ్రతల తగ్గుదలను, వ్యవసాయ చక్రం మొదలును సూచించే సాంప్రదాయక కార్యక్రమం మృగ శిర కార్తె. ఈ కాలంలో చేపలు, సముద్రపు ఆహారం తినేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారని తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో మృగశిర కార్తె రోజున చేపలు తినడం వల్ల శ్వాసకోశ సంబంధిత రుగ్మతలు తగ్గుతాయని, అదే విధంగా రుతు మార్పులకు శరీరం సన్నద్ధమవుతుందని భావిస్తారు.
కాగా మృగ శిర కార్తెను పురస్కరించుకొని మెదక్ ,హవేలి ఘన్పూర్ మండలాలలో మండల కేంద్రంతో పాటు కొముటూర్, మంబోజి పల్లి, బ్యాతోల్ తిమ్మాయిపల్లి, పరిసర గ్రామాల్లో చెరువుల వద్ద చేపల కొనుగోళ్లు జోరందుకున్నాయి. కార్తె తొలి రోజున చేపలు తినడం ఇక్కడి ప్రజల ఆనవాయితీ కావడం వల్ల, స్థానిక చేపల మార్కెట్లు, తాత్కాలిక విక్రయ కేంద్రాలు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయాయి.
ఈ సందర్భంగా మార్కెట్లలో ఉదయం నుంచే సందడి వాతావరణం నెలకొంది. చెరువుల నుండి సేకరించిన తాజా రొహు, బొచ్చె (కట్ల) వంటి వివిధ రకాల చేపలను పెద్ద ఎత్తున అందుబాటులో ఉంచారు.
Nithya Raman: లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో దూసుకెళ్తున్న నిత్యా రామన్
Flight crash | ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై పేలిన విమానం.. ఇద్దరు పైలట్లు మృతి..!
Bansuwada | విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకే పంపాలి.. బడిబాటలో ఉపాధ్యాయులు