Flight crash | ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై పేలిన విమానం.. ఇద్దరు పైలట్లు మృతి..!
Flight crash | డొమినికన్ రిపబ్లిక్ (Dominican Republic) లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అమెరికా రిజిస్ట్రేషన్‌తో ఉన్న గల్ఫ్‌స్ట్రీమ్ G200 (Gulfstream G200) ప్రైవేట్ జెట్ విమానం.. లా రొమానా అంతర్జాతీయ విమానాశ్రయం (La Romana International Airport) లో అత్యవసరంగా ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తూ క్రాష్ అయ్యింది. రన్‌వేపై వేగంగా దూసుకెళ్లిన విమానం ఒక్కసారిగా పేలి పెద్ద అగ్నిగోళంలా మారిపోయింది.
Flight crash : డొమినికన్ రిపబ్లిక్ (Dominican Republic) లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అమెరికా రిజిస్ట్రేషన్‌తో ఉన్న గల్ఫ్‌స్ట్రీమ్ G200 (Gulfstream G200) ప్రైవేట్ జెట్ విమానం.. లా రొమానా అంతర్జాతీయ విమానాశ్రయం (La Romana International Airport) లో అత్యవసరంగా ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తూ క్రాష్ అయ్యింది. రన్‌వేపై వేగంగా దూసుకెళ్లిన విమానం ఒక్కసారిగా పేలి పెద్ద అగ్నిగోళంలా మారిపోయింది. ఈ ప్రమాదంలో విమానాన్ని నడుపుతున్న పైలట్, కో-పైలట్ ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రైవేట్ జెట్ డొమినికన్ రిపబ్లిక్‌లోని లా రొమానా నుంచి అమెరికాలోని టెక్సాస్ నగరానికి బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్‌పోర్ట్‌కు నైరుతి దిశలో 16 నాటికల్ మైళ్ల దూరంలో ఉండగా విమానంలో తీవ్ర సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో అప్రమత్తమైన పైలట్లు అత్యవసర ల్యాండింగ్ కోసం తిరిగి లా రొమానా ఎయిర్‌పోర్ట్‌కు రావడానికి అనుమతి కోరారు. రన్‌వే 29పై ల్యాండ్ అయ్యే క్రమంలో విమానం అదుపుతప్పి పక్కనే ఉన్న గడ్డి మైదానంలోకి దూసుకెళ్లి భారీ శబ్దంతో పేలిపోయింది.
ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్పోర్ట్ అత్యవసర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు మరణించినట్లు డొమినికన్ సివిల్ ఏవియేషన్ ఇనిస్టిట్యూట్ (IDAC) నిర్ధారించింది. ఈ విమానంలో ప్రయాణికులు లేరని, ఇది కేవలం పొజిషనింగ్ (Ferry Flight) ఫ్లైట్ మాత్రమేనని అధికారులు తెలిపారు. విమానం వేగంగా దూసుకుపోతూ పేలిపోతున్న దృశ్యాలు అక్కడ ఉన్న కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రమాదానికి గురైన ఈ గల్ఫ్‌స్ట్రీమ్ G200 విమానాన్ని 2004లో తయారు చేశారు.
ప్రమాదం జరిగిన సమయంలో వాతావరణం చాలా స్పష్టంగా ఉందని, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు లేవని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. విమానంలోని ఇంజిన్ లేదా హైడ్రాలిక్ వ్యవస్థలో తలెత్తిన లోపాలవల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ డేటాను, మెయింటెనెన్స్ రికార్డులను పరిశీలిస్తున్నామని, త్వరలోనే ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలుస్తాయని ఏవియేషన్ అధికారులు వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

