Father Vs Son | గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి రాష్ట్రంలో జరుగుతున్నసర్పంచ్ ఎన్నికల్లో చాలా మంది ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అంటున్నారు.పెద్దవాళ్లతోపాటు ఈ సారి యూత్ ఎక్కువగా పోటీలో నిలిచేందుకు ఆసక్తి చూపిస్తుండటం విశేషం.
అయితే సాధారణంగా ఎన్నికలు వచ్చిన సందర్భంలో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు అభ్యర్థులుగా పోటీలో నిలవడం చూస్తుంటాం. మెదక్ జిల్లాలో కూడా అలాంటి పోటీనే ఉండబోతుంది. తండ్రీకొడుకులు సర్పంచ్ పదవికి పోటీ పడుతూ వార్తల్లో నిలిచారు.
మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ గ్రామంలో సర్పంచ్ స్థానానికి తండ్రి మానెగళ్ళ రామకృష్ణయ్య నామినేషన్ వేశాడు. మరోవైపు అతని కొడుకు వెంకటేష్ కూడా అదే సర్పంచ్ స్థానానికి తండ్రికి ప్రత్యర్థిగా నిలబడి ఔరా అనిపిస్తున్నాడు.
మిగిలిన అభ్యర్థుల పోటీని అటుంచితే.. ఈ ఇద్దరు తండ్రీ కొడుకులు మాత్రం సర్పంచ్ నువ్వా..నేనా..? సై అంటే సై అన్నట్టుగా బరిలోకి దిగి అందరిలో ఉత్కంఠ రేకెత్తిస్తున్నారు. మరి ఇద్దరు ఎవరు ఓటర్ల మనస్సు గెలుచుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
మరి ఈ తండ్రీకొడుకులిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది.. ఇద్దరిలో ఓటర్లు ఎవరికి ఎక్కువగా ఓటేస్తారు..? ఇద్దరిలో ఎవరో ఒకరిని సర్పంచ్ పదవి వరిస్తుందా..? లేదంటే మిగిలిన అభ్యర్థుల్లో ఎవరైనా గెలుస్తారా..? అనేది తెలియాల్సి ఉంది.
Mahabubabad | లారీని ఢీ కొన్న బైక్.. రైల్వే ఉద్యోగి మృతి
Jyotiraditya Scindia: సంచార్ సాథీ యాప్‌తో స్నూపింగ్ జరగదు: లోక్‌సభలో మంత్రి సింథియా