మైనార్టీల అభివృద్ధికి బీఆర్ఎస్ కృషి
మున్సిపల్ ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలు బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ, ఎన్నికల ఇన్చార్జి ఫరూఖ్హుస్సేన్ అన్నారు. మెదక్ పట్టణంలో రసీద్ కాలనీలో శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
- మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి
- మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్హుస్సేన్
మెదక్, అర్బన్, ఫిబ్రవరి 6: మున్సిపల్ ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలు బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ, ఎన్నికల ఇన్చార్జి ఫరూఖ్హుస్సేన్ అన్నారు. మెదక్ పట్టణంలో రసీద్ కాలనీలో శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముస్లింలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ నిధులు మంజూరు చేశారన్నారు. తెలంగాణ ఉద్యమంలో మెదక్ ప్రాంత ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక మెదక్ జిల్లా ఏర్పాటు చేశారని గుర్తుచేశారు.
బీఆర్ఎస్ పాలనలో మెదక్ పట్టణంలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేశారన్నారు. ప్రత్యేక నిధులతో మెదక్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు మెదక్ జిల్లాను అభివృద్ధి చేసేందుకు ఎంతో కృషి చేశారన్నారు. ముస్లింలకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో షాదీఖాన, మైనార్టీ గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసి, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించారన్నారు. ముస్లింల అభివృద్ధికి కృషి చేసిన బీఆర్ఎస్ అభ్యర్థిని కొండన్ సావిత్రి సురేందర్గౌడ్ను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ సురేందర్‌గౌడ్, ఏడుపాయల దేవాలయ కమిటీ మాజీ చైర్మన్ విష్షువర్ధన్రెడ్డి, ముస్లిం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

