శివ్వంపేట, మే 25 : మెదక్ జిల్లా శివ్వంపేట మండలం రత్నాపూర్ గ్రామ రైతులు సోమవారం శివ్వంపేట పీఏసీఎస్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్లను తరలించేందుకు లారీలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పం టను కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చామని, రోజుల తరబడి ధాన్యం అక్కడే నిల్వ ఉండిపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నామని తెలిపారు. లారీలు పంపించాలని పలుమార్లు పీఏసీఎస్ సీఈవో మధుకు ఫోన్ చేసినప్పటికీ స్పందించడం లేదన్నారు. ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియని పరిస్థితి ఉందని, వర్షం పడితే ధాన్యం తడిసి నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అనంతరం పీఏసీఎస్ కార్యాలయం ఎదుట నర్సాపూర్-తూప్రాన్ ప్రధా న రహదారిపై రైతులు రాస్తారోకో చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎస్ఐ మధుకర్‌రెడ్డి అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.
లారీలు రావడం లేదని రైతుల రాస్తారోకో

గీ ప్రభుత్వంపై నమ్మకం లేదు..
గీ కాంగ్రెస్ ప్రభుత్వంపై నాకు నమ్మకం పోయింది. వడ్లు కొనుగోలు కేంద్రానికి తెచ్చి 25 రోజులు అవుతుంది. మ్యాచర్ వచ్చి 15రోజులు అవుతుంది. అఫీసర్లు ఇవ్వాలా కాంటా పెడుతా, రేపు కాంటా పెడుతాం అనుడే ఉంది కాని నింపింది లేదు.. కాంటా పెట్టింది లేదు. ఆఖరుకు తహసీల్దార్ వచ్చి వడ్లన్నీ ఒక దగ్గర పెట్టి, తర్వాత రైస్‌మిల్లుకు పోయినంక మీకు పైసలొస్తాయని, అప్పటివరకు పైసలకు గ్యారెంటీ లేదని చెప్పిండు. మీ ఇష్టం ఉంటే ఎక్కడైనా అమ్ముకోవచ్చు. వడ్లు మీవి అని తహసీల్దార చెప్పిండు. ప్రభుత్వం సరిగ్గా పనిజేస్తలేదు. మళ్లీ వానకాలం వస్తున్నది. మా వడ్లు కోనేటట్టు పరిస్థితి కనిపిస్తలేదు. ఇప్పటికే నష్టపోయినం. అడ్డికి పావుశేర్ లా ప్రైవేట్ మిల్లర్లకు అమ్ముకుంటున్నాం. ఇప్పటివరకు వరికోసిన మిషన్లకు పైసలు ఇవ్వలేదు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి. ఇట్లాసొంటి ప్రభుత్వం మాత్రం ఉండొద్దు. ఇది రైతులకు లాభంలేని ప్రభుత్వం.
-లక్ష్మయ్య, రైతు, చిన్నగొట్టిముక్ల (మెదక్ జిల్లా)
నెలరోజులైనా నా వడ్లు కొనలేదు..
మా ఊరిలోని కొనుగోలు కేంద్రానికి వడ్లు తెచ్చి దాదాపు నెలరోజులవుతుంది. లారీలు రాకపోవడంతో ఎక్కడి వడ్ల కుప్పలు అక్కడే ఉన్నాయి. సెంటర్ సిబ్బందిని అడిగితే ట్రాక్టర్లలో లోడింగ్ చేసుకోండని చెబుతున్నారు. రైస్‌మిల్లులో అన్లోడ్ అయ్యేవరకు రోజుకు వెయ్యి రూపాయలు చెల్లించాలని చెబుతున్నారు. అధికారులు వెంటనే లారీలు పంపాలి.
-అల్లం సత్యమ్మ, రత్నాపూర్,మహిళా రైతు(మెదక్ జిల్లా)