Drinking Water | రాయపోల్, మార్చి 14 : తలాపున గోదావరి నీళ్లు వస్తున్నప్పటికీ తమ పంట పొలాలకు నీరు రావడం లేదని మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ చౌరస్తాలోని రామాయంపేట కెనాల్ వద్ద ఇవాళ
రోడ్డుపై టెంట్లు వేసి బైఠాయించారు. సాగు నీటి కోసం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.
చేగుంట- గజ్వేల్ ప్రధాన రహదారి కిలోమీటర్ల పొడవున్న వాహనాలు ఎక్కడెడక్కడ నిలిచిపోయాయి. చేగుంట మండలంలోని పోతన్ పల్లి, పోతంశెట్టిపల్లి, మక్కరాజుపేట, చందాయిపేట , కసాన్ పల్లి, దౌల్తాబాద్ మండలం మాచిన్ పల్లి తదితర గ్రామాలకు చెందిన 500 మంది రైతులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రోడ్డుపై బైఠాయించి తమ పంట పొలాలకు గోదావరి ద్వారా సాగునీరు అందించి తన పంటలను కాపాడాలని రైతులు డిమాండ్ చేశారు.
నాయకులు, ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు తమ బాధలను దృష్టిలో పెట్టుకొని పరిష్కారం చేయాలని లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయా గ్రామాల ప్రజలు ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా రోడ్డుపై టెంట్ వేసుకొని బైటాయించడంతో కిలోమీటర్ల పొడవునా వాహనాలు ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయి.
ఈ విషయం తెలుసుకున్న తొగుట సీఐ లతీఫ్, ఎస్సై శ్రీరామ్ ప్రేమ్ దీప్ లు సంఘటనా స్థలానికి చేరుకొని రైతులను సముదాయించారు. తమకు కాలువల ద్వారా నీరు అందించేందుకు అధికారుల దృష్టికి తీసుకుపోయి సమస్యను పరిష్కరించాలని రైతులు పేర్కొన్నారు. రైతుల డిమాండ్లను సామరస్యంగా పరిష్కరించే విధంగా కృషి చేస్తామని సీఐ రైతులకు సూచించారు.
Read Also :
HYDRAA | బండ్లగూడలో హైడ్రా కూల్చివేతలు
ASP Chittaranjan | విద్యార్థులు ఒత్తిడిని అధిగమిస్తేనే విజయం తథ్యం : ఏఎస్పీ చిత్తరంజన్
Harish Rao | కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్: హరీశ్‌రావు