అక్కన్నపేట, జనవరి 3: అనేక హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ మోసం చేసిందని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మల్లంపల్లి రైతు వేదిక వద్ద రైతులు శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు, సింగిల్ విండో డైరెక్టర్ మ్యాక నారాయణ, మాజీ మార్కెట్ కమి టీ డైరెక్టర్ ముత్తినేని వేణుగోపాల్‌రావు మాట్లాడుతూ..రూ.2 లక్షలపై ఉన్న రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభు త్వం ఆరు గ్యారెంటీల పేరుతో అందరినీ మో సం చేసిందన్నారు. ఏకకాలంలో ఎలాంటి షరతు లు లేకుండా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి నిబంధనలు, షరతులు, కొర్రీలు పెట్టి సగం మంది రైతులు రుణమాఫీ వర్తింపచేయలేదన్నా రు. రైతుభరోసా ఇవ్వక పోవడంతో రైతులు పెట్టుబడులకు అప్పులు చేస్తున్నారని, బోనస్ బోగస్ అయ్యిందని ఆరోపించారు. సంపూర్ణ రుణమాఫీ చేయాలని ఏఈవో సంగీతకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.