రామాయంపేట, జూలై 10: డీఏపీ ఎరువుల కోసం రైతులు బారులు తీరుతున్నారు. శుక్రవారం మెదక్ జిల్లా రామాయంపేటలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం వద్ద ఎరువుల కోసం నిజాంపేట, రామాయంపేట మండలాల రైతులు క్యూ కట్టారు.
డీఏపీ ఎరువు బయట దుకాణాల్లో రూ.2100 ధరకు విక్రయిస్తున్నారు. పీఏసీఎస్‌లో రూ. 1300లకే విక్రయిస్తుండడంతో రైతులు పీఏసీఎస్ వద్దకు శుక్రవారం ఉదయం ఆరు గంటలకే చేరుకున్నారు. మధ్యాహ్నం వరకు వేచి ఉండగా, ఒక్కో రైతుకు ఒక బ్యాగు మాత్రమే దొరికింది.