కొండాపూర్, జూన్ 25: రైతు భరోసాకు ఆంక్షలు వద్దని, పది ఎకరాల్లోపు రైతులందరికీ రైతుభరోసా ఇవ్వాలని రైతులు అభిప్రాయపడ్డారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్లో ప్రభుత్వం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో రైతులు అభిప్రాయా న్ని వ్యక్తం చేశారు. రైతులకు సమాచారం ఇవ్వకుండా అభిప్రాయం నిర్వహించడం సరికాదన్నారు. అనంతరం రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం 5 ఎకరాల్లోపు రైతులకు మాత్రమే రైతుభరోసాను ఇవ్వడానికి చూస్తోందని, అలా కాకుండా 10 ఎకరాల్లోపు రైతులకు రైతుభరోసా ఇవ్వాలని అనంతసాగర్ గ్రామానికి చెందిన జైపాల్ అనే రైతు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ప్రభు త్వం సాగులో ఉన్న ప్రతి రైతుకూ డబ్బులు చెల్లించిందని, ఈ ప్రభుత్వం కూడా 10 ఎకరాల్లోపు ఉన్న రైతులకు మాత్రమే అందివ్వాలన్నారు. అవసరమయితే వ్యవసాయ శాఖ అధికారులతే క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమం లో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, జిల్లా వ్యవసాయాధికారి అంబికాసోని, తహసీల్దార్ అనిత, మండల వ్యవసాయాధికారులు గణేశ్, ప్రతిభ, డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్, ఆర్ఐలు, మండల వ్యవసాయ విస్తరణ అధికారులు రవి, మనోహర్ రైతులు పాల్గొన్నారు.