నర్సాపూర్, జూలై 28: కొండపోచ మ్మ కాలువ నిర్మాణం రద్దు చేయాలంటూ రైతులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష ఆదివారం 17వ రోజుకు చేరుకుంది. మండలంలోని చిన్నచింతకుంట, బ్రాహ్మణపల్లి, శివంపేట్ మండలం చెన్నాపూర్ గ్రామా ల రైతులు ఆదివారం దీక్షలో కూర్చున్నారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..కొండపోచమ్మ కాలు వ వద్దని, ఈ ప్రాంతాన్ని సెమీ అర్బన్‌గా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. దీక్షలో రైతులు నరసింహారెడ్డి, మహేశ్‌గౌడ్, శ్రీకాంత్‌రెడ్డి, ని శాంత్‌రెడ్డి, ప్రభాకర్, దత్తాత్రేయ, రాజమౌళి, నగేశ్‌గౌడ్, శ్రీశైలంయా దవ్, హన్మంత్ గౌడ్, ప్రేమ్‌చరణ్ తదితరులు పాల్గొన్నారు.