గుమ్మడిదల, ఫిబ్రవరి 18: ప్యారానగర్ అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ డంపింగ్‌యార్డు ఏర్పాటు వ్యతిరేకిస్తూ చేస్తున్న ఆందోళనలు మంగళవారం మరింతగా ఉద్రిక్తంగా కొనసాగాయి. మంగళవారం నల్లవల్లి, కొత్తపల్లి, ప్యారానగర్ గ్రామస్తులు, రైతు జేఏసీ నాయకులు ట్రాక్టర్లపై ర్యాలీగా డంపింగ్‌యార్డు నిర్మాణం చోటుకు బయలుదేరారు. వారిని మార్గమధ్యలో పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది.
పోలీసులు బలవంతంగా వెనక్కి పంపడంతో బాధిత గ్రామాల ప్రజలు హైవేపై నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డంపింగ్ యార్డు ఏర్పాటుపై రేవంత్ సర్కారు మొండిగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహిస్తూ మంగళవారం గుమ్మడిదలలో జాతీయ రహదారి-765డీ పై బతుకమ్మ ఆటపాటలతో నిరసన తెలిపారు. అటుగా వెళ్తున్న ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి నల్లవల్లి, ప్యారానగర్ గ్రామస్తులకు సంఘీభావం తెలిపారు.
గుమ్మడిదలలో మంగళవారం 8వ రోజు రిలే నిరాహార దీక్షలో బ్రాహ్మణ సంఘం సభ్యులు పాల్గొని డంపింగ్‌యార్డుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బ్రాహ్మణ సంఘం నాయకులు శంకర్‌శర్మ, కిరణ్‌కుమార్‌శర్మ, రవీందరరావు కులకర్ణి, కేవీ. నర్సింహాచార్యులు, విజయ్రామన్చార్యులు, రాముశర్మ, రాఘవేందర్రావు, అనంత్కుమార్శర్మ, ప్రసాద్, చైతన్యశర్మ, మహిళు మాధవి కులకర్ణి, లక్ష్మీసంతోషి, నర్మద. అన్నపూర్ణ, రంగనాయకి తదితరులు పాల్గొన్నారు. వారికి సీపీఏం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్కరాములు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జయరాజు, రాజయ్య, కేవీపీఎస్ కార్యదర్శివర్గ సభ్యులు అతిలేలి మాణిక్య, నాగేశ్వర్రావు సంఘీభావం తెలిపారు.
చుక్కరాములు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డు ఏర్పాటు చేసి ప్రజల పచ్చని బతుకుల్లో కుంపటి పెడతారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ప్రజాభిప్రాయం లేకుండా కస్ట్టోడియల్ భూముల్లో డంపింగ్ యార్డు నిర్మాణం ఎలా చేస్తారని ప్రశ్నించారు. డంపింగ్‌యార్డు పనులు వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. ఇది ఒక గుమ్మడిదల మండల ప్రజల సమస్య కాదని, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజల సమస్య అని అన్నారు.
డంపింగ్‌యార్డు ఏర్పాటుతో నర్సాపూర్ రాయచెరువు, గొలుసుకట్టుగా ఉన్న చెరువులకు, కుంటలకు కాలుష్య ముప్పు పొంచి ఉందన్నారు. వ్యవసాయం కుంటుపడే ప్రమాదం ఉందన్నారు. డంపింగ్‌యార్డు అనుమతులు రద్దు చేయాంటూ ఈనెల 20న సంగారెడ్డి జిల్లా కేంద్రంలో దీక్ష చేపడతామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో రైతు జేఏసీ అధ్యక్షుడు చిమ్ముల జైపాల్‌రెడ్డి, రైతు మహిళా జేఏసీ అధ్యక్షురాలు మల్లమ్మ, చిమ్ముల గోవర్ధన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ చిమ్ముల నర్సింహారెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు సదానందరెడ్డి, మద్లు బాల్‌రెడ్డి, బాలకృష్ణరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు, ఇప్పుడు రాక్షస పాలన కొనసాగిస్తున్నదని మండిపడ్డారు. ఇంత దుర్మార్గమైన పాలకులను ఎప్పుడూ చూడలేదన్నారు. రెండు వారాలుగా ఈ ప్రాంత ప్రజలు ఆందోళనలు చేస్తుంటే అధికార యంత్రాంగం, ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం బాధాకరమని శేరి సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. డంపింగ్‌యార్డు ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ చేయాలన్న సోయి కాంగ్రెస్ సర్కారుకు లేదా అన్ని ప్రశ్నించారు.
జీహెచ్ఎంసీ పరిధిలోనే డంపింగ్‌యార్డు ఏర్పాటు చేయాలని కోర్టు నిబంధనలు బేఖాతరు చేస్తూ గ్రామీణ ప్రాంతమైన కస్టోడియన్ భూముల్లో ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమన్నారు. వెంటనే డంపింగ్‌యార్డు అనుమతులు రద్దు చేయాలని, లేనిపక్షంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని రేవంత్ సర్కారుకు ఆయన హెచ్చరించారు. ఆందోళనలో రైతు జేఏసీ నాయకులు ఆంజనేయులు, కొత్తపల్లి మల్లేశ్‌గౌడ్, రామకృష్ణ, ఫయాజ్ షరీఫ్, మాజీ సర్పంచ్‌లు శంకర్, శ్రీనివాస్, శంకర్, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
– ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి