నిజాంపేట, సెప్టెంబర్ 14: నిజాంపేట మండలంలోని కల్వకుంట పీఏసీఎస్ సొసైటీ వద్ద యూరియా (Urea) కోసం రైతులు బారులు తీరారు. ఉదయం 4 గంటలకే సొసైటీ వద్దకు చేరుకొని యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. రోజురోజుకు యూరియా సమస్య ఎక్కువనే అవుతున్నది. ప్రజలకు సరిపడా యూరియాను సరఫరా చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని రైతులు మండిపడుతున్నారు. వృద్ధ రైతులు క్యూలైన్లో నిలబడి అసహనానికి గురవుతున్నారు.