నంగునూరు, మే 6 : ప్రభుత్వం వెంటనే ధాన్యం సేకరణ చేపట్టాలని, తాలు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న మిల్లర్ల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మం డల పరిధిలోని తిమ్మాయపల్లి రైతులు ఆందోళనకు దిగారు. సిద్దిపేటహనుమకొండ జాతీ య రహదారిపై రైతులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి 15 రోజు లు గడుస్తున్నా నత్తనడకన కొనసాగుతున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.వ్యవసాయాధికారులు ధాన్యాన్ని పరిశీలించి బీగ్రేడ్గా ధ్రువీకరించినప్పటికీ మిల్లులకు పంపిన ధాన్యంలో తాలుఉందనే సాకుతో మూడు రోజులుగా మిల్లర్లు దిగుమతి చేసుకోవడం లేదని వారు ఆరోపించారు.
మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి ఆరబోసిన ధాన్యం తడిసి తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న రాజగోపాల్ పేట ఎస్సై వివేక్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి ధాన్యం సేకరణలో జాప్యం లేకుం డా చూస్తామని, మిల్లర్ల సమస్య పరిషరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు నిరసన విరమించారు.