నేడు కిసాన్ దివస్
దేశ మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్ జయంతిని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా కిసాన్ దివస్ (జాతీయ రైతు దినోత్సవం)ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల పంటల్లో మంచిదిగుబడి సాధిస్తున్న రైతన్నలను ఉత్తమ రైతులుగా ఎంపిక చేసి వారిని రైతు సంఘం సభ్యులు ఘనంగా సన్మానిస్తూ రైతుపండుగను నిర్వహించుకుంటున్నారు.
- జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఏటా గుమ్మడిదలలో రైతు దినోత్సవ వేడుకలు
- వివిధ రకాల పంటల్లో మంచి దిగుబడి సాధించిన రైతులకు సన్మానిస్తున్న రైతు సంఘం సభ్యులు
- ఉత్తమ రైతులను సన్మానిస్తున్న రైతుసంఘం ప్రతినిధులు
- నేడు గుమ్మడిదలలో రైతు దినోత్సవ వేడుకలు
గుమ్మడిదల, డిసెంబర్ 22: దేశ మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్ జయంతిని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా కిసాన్ దివస్ (జాతీయ రైతు దినోత్సవం)ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల పంటల్లో మంచిదిగుబడి సాధిస్తున్న రైతన్నలను ఉత్తమ రైతులుగా ఎంపిక చేసి వారిని రైతు సంఘం సభ్యులు ఘనంగా సన్మానిస్తూ రైతుపండుగను నిర్వహించుకుంటున్నారు. గుమ్మడిదల మండలంలో పలువురు రైతులు వరి పంటతోపాటు వివిధరకాల కూరగాయ పంటలను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏటా రైతు సంఘం మండల అధ్యక్షుడు మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో జాతీయరైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి, భారతదేశ మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్ జయంతిని నిర్వహించి, రైతులకు ఆయన చేసిన సేవలను వివరిస్తారు.
వ్యవసాయాన్ని పండుగ చేసింది కేసీఆర్ సర్కార్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పదేండ్లల్లో కేసీఆర్ సర్కార్ వ్యవసాయాన్ని పండుగలా మార్చింది. మాజీ సీఎం కేసీఆర్ సాగుకు ఉచితంగా నిరంతర కరంట్, రైతులను ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పెట్టుబడిసాయం వంటి పథకాలను ఎన్నో తీసుకువచ్చారు. పంటలపై అవగాహన చేయడానికి రైతువేదికలు, రైతు మృతి చెందిందే రూ.5 లక్షల రైతుబీమా అందించి ఆకుటుంబానికి అండగా నిలిచింది కేసీఆర్ సర్కార్. ఇప్పుడు రైతులు వ్యవసాయాన్ని నమ్ముకుని బతుకుతున్నారంటే అది మాజీ సీఎం కేసీఆర్ చలువే.
– నంద్యాల విష్ణువర్ధన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్, గుమ్మడిదల మండలం
ఏటా రైతుదినోత్సవాన్ని ఘనంగా జరుపుకొంటాం
దేశ మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్ జయంతిని రైతు దినోత్సవంగా జరుకొంటున్నాం. మా మండలంలో వివిధ గ్రామాల్లో రైతులు పండించిన పంటల్లో మంచి దిగుబడి సాధించిన రైతులను, ఆదర్శ రైతులుగా గుర్తించి సన్మానించి, ప్రోత్సహిస్తున్నాం. రైతులకు సహకరిస్తున్న వ్యవసాయ, రెవెన్యూ, బ్యాంకు, సహకార సంఘం అధికారులను గుర్తించి వారిని కూడా సన్మానిస్తున్నాం. దీనివల్ల యువ రైతులు కూడా వ్యవసాయంపై మక్కువ పెంచుకుంటున్నారు.
మంచి దిగుబడి సాధించడంలో పోటీపడుతున్నారు.
– రైతు సంఘం అధ్యక్షుడు పోచుగారి మోహన్‌రెడ్డి, గుమ్మడిదల మండలం
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

