రామాయంపేట, మే 22: జీలుగ విత్తనాల కోసం రైతులు బుధవారం రామాయంపేటలోని రైతు సేవాకేంద్రం, వ్యవసాయ కార్యాలయం, దుకాణాల్లో బారులుతీరారు. పదేండ్లుగా లేని ఇబ్బందులను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లోనే చుక్కలు చూపిస్తుందని రైతులకు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రా ల్లో ధాన్యం కొనుగోలు చేయక తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వం జీలు గ విత్తనాలు అందించడంలోనూ రైతులకు అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. ప్రభు త్వం ఒక పక్క రైతులకు ఇబ్బందులు కలగడం లేదని చెబుతున్నా రైతులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు. విత్తనాలు సరిగ్గా అందకపోవడంతో రైతులు సంబంధిత వ్యాపారితో వాగ్వాదానికి దిగారు.
జీలుగ విత్తనాలు సరిపడా ఉన్నాయని మండల వ్యవసాయాధికారి రాజ్నారాయణ పేర్కొన్నారు. రామాయంపేటలోని పలు వ్యాపార కేంద్రాల్లో జీలుగ విత్త్తన సంచులను రైతులకు అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బుధవారం ఒక్కరోజే 500 జీలుగ విత్తన బ్యాగులను రైతులకు అందజేశామని చెప్పారు. మొదట ఒక్కో బ్యాగును మాత్రమే అందజేశామని, చుట్టుపక్కల మండలాల నుంచి రైతులు పెద్దఎత్తున వచ్చి విత్తనాలు కొనుగోలు చేశారని చెప్పారు.