రోడ్డెక్కిన రైతులు
ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే అక్కడ నెల రోజులైనా ధాన్యాన్ని తరలించడకపోవడంతో ఆగ్రహించిన రైతులు సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గం మండలంలోని ఐబీ చౌరస్తా-వట్పల్లి రహదారిపై తడిపిన ధాన్యంతో గురువారం ఆందోళన చేపట్టారు.
- లారీలు రావు.. ధాన్యాన్ని తరలించరు.. ఆందోళనలో అన్నదాతలు
అల్లాదుర్గం, జూన్ 4: ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే అక్కడ నెల రోజులైనా ధాన్యాన్ని తరలించడకపోవడంతో ఆగ్రహించిన రైతులు సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గం మండలంలోని ఐబీ చౌరస్తా-వట్పల్లి రహదారిపై తడిపిన ధాన్యంతో గురువారం ఆందోళన చేపట్టారు.
దీంతో రహదారిపై ఎ్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేయడానికి 10 నుంచి 15 రోజులు, ధాన్యాన్ని తరలించడానికి మరో పది రోజులు పడుతున్నదని రైతు లు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోళ్లలో వేగం చేయకపోవడం, లారీల కొరత కారణంగా 20 రోజులకు పైగా ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. తూకం వేసిన ధాన్యం తరలించకపోవడంతో గురువారం కురిసిన వర్షంతో పూర్తి తడిసిపోయిందని వారు తెలిపారు.
రైతులు నష్టపోతున్నా కేంద్రాల నిర్వాహకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. విషయాన్ని తెలుసుకున్న అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి, అల్లాదుర్గం, పెద్దశంకరంపేట ఎస్ఐలు శంకర్, ప్రవీణ్రెడ్డి, తహసీల్దార్ మల్లయ్య, ఎంపీడీవో వేదప్రకాశ్రెడ్డి అక్కడికి చేరుకుని రైతులకు నచ్చచె ప్పే ప్రయత్నం చేశారు. ధాన్యాన్ని లారీల్లో తరలించే వరకు ఇక్కడి నుం చి జరిగే ప్రసక్తే లేదని రైతుల భీష్మించుకూర్చున్నారు. రైస్మిల్లర్లు, పై అధికారులతో మాట్లాడి సాయంత్రానికి లారీలు వచ్చే ఏ ర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

