పటాన్చెరు, జూలై 3: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీ ఎదుట గురువారం కార్మికుల కుటు ంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. నా కొడుకు ఎక్కడ ఉన్నాడు… మూడు రోజులుగా ఫ్యాక్టరీ చుట్టూ తిరుగుతున్నా జాడ చెప్పడం లేదు. ఫ్యాక్టరీ ప్రమాదంలో ఆచూకీ లభించని కార్మికుడు జాస్టిన్ (22) కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని జాస్టిన్ తండ్రి రాందాస్‌తో మాట్లాడారు. మూడు రోజులుగా అధికారులు తన కొడుకు ఆచూకీ తెలుపడం లేదని తండ్రి రాందాస్ గేటు పక్కన ఉన్న చెట్టుకు తలకొట్టుకోవడంతో అతడికి గాయాలయ్యాయి. ఫ్యాక్టరీ లోపల ఉన్న వైద్య సిబ్బంది వచ్చి ప్రథ మ చికిత్స చేశారు. మా కొడుకు ఆచూకీ తెలుపాలని అతడు వేడుకున్నాడు.
పాశమైలారం సిగాచి ఫ్యాక్టరీలో జరిగిన ఘటనలో ఎక్కువ మంది బీహారు రాష్ట్రానికి చెందిన వారు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్టరీలో జరిగిన ఘటనకు సంబంధించిన సమాచారాన్ని బిహార్ ప్రభుత్వానికి పంపించింది. అక్కడి ప్రభుత్వం తీవ్రగాయలైన కార్మికులు, బాధితులకు సహాయక చర్యలు చేసేందుకు బృందాన్ని పంపించింది. నలుగురు అధికారులు పాశమైలారం ఘటన జరిగిన ఫ్యాక్టరీకి చేరుకొని ప్రమాదానికి సంబంధించిన వివరాలు సేకరించారు. మెరుగైన వైద్యం అందించేందుకు తెలంగాణ అధికారులతో చర్చలు జరిపారు. కార్మికుల మృతదేహాలను బీహారు రాష్ర్టానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. పటాన్చెరు సర్కార్ దవాఖానలో కార్మికుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
పాశమైలారం పారిశ్రమికవాడలో ఏర్పాటు చేసిన ప్రత్యేక హెల్ప్‌లైన్ వద్ద అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ పర్యవేక్షణలో వివరాలు సేకరించారు. తమ కుటుంబ సభ్యులు ఫ్యాక్టరీలో పనిచేస్తారని, ప్రమాదం జరిగినప్పుటి నుంచి కనిపించడం లేదని పలువురు ఫిర్యాదు చేశా రు. ఫ్యాక్టరీ సమీపంలోకి ఎవరూ రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నాలుగురు సభ్యుల బృందం సిగాచి పరిశ్రమకు వచ్చింది. కమిటీలో శాస్త్రవేత్త వెంకటేశ్వర్రావు, డాక్టర్ ప్రతాప్‌కుమార్, డాక్టర్ సూర్యనారాయణ , సంతోష్ ఉన్నారు. వీరు ఫ్యాక్టరీలో ప్రమా దం జరిగిన భవనంతో పాటు యంత్రా లు ఉన్న స్థలాలను పరిశీలిం చి వివరాలు సేకరించారు.