Family Attack | బోరు విషయంలో స్వంత అన్న కుటుంబంపై తమ్ముడి కుటుంబం దాడికి పాల్పడింది. బుధవారం అర్ధరాత్రి గొడ్డలి, కర్రలు, రాళ్లతో జరిగిన ఈ దాడిలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.
వివరాలలోకి వెళ్తే.. గ్రామానికి రాచ్ పల్లి బాలయ్య, రాచ్ పల్లి భిక్షపతిలు స్వంత అన్నదమ్ములు. రాచ్ పల్లి బాలయ్యకు రెండు ఎకరాల పొలం ఉంది. ఉన్న బోరు నుంచి నీరు రాకపోవడంతో ఇంటిపక్కనే పొలం ఉండడంతో ఇంట్లో బోరువేసుకుంటే ఇంటితోపాటు పొలానికి వాడుకోవచ్చని భావించి బుధవారం రాత్రి ఇంటివద్ద ఏర్పాట్లు చేసుకున్నాడు.
అయితే గతం నుంచే రాచ్ పల్లి బాలయ్య, రాచ్ పల్లి భిక్షపతిలకు ఒకరంటే ఒకరికి పడడంలేదు. బాలయ్య ఇంటికి బోరు బండి రావాలంటే భిక్షపతి పొలంలో నుండే రావాల్సి ఉంది. అయితే భిక్షపతి బీడుగా ఉన్న పొలంలో నుండి బోర్ బండి రాకుండా నిండుగా నీరు పారించాడు. దీంతో బోర్ బండి రాకుండా నీరు ఎందుకు పారించావని ఇరు కుటుంబాలు తిట్టుకున్నారు.
ఇదే రాత్రి రెండు గంటల ప్రాంతంలో రాచ్ పల్లి భిక్షపతి, కుమారులు ప్రసాద్, రాజు, భార్య సుశీల నలుగురు కలిసి బాలయ్య కుటుంబంపై గొడ్డలి, కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో రాచ్ పల్లి బాలయ్య, కుమారులు నరసింహులు, యాదగిరి, కోడలు అంజమ్మ, భార్య పున్నమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. అదే రాత్రి నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా అక్కడినుంచి పరిస్థితి విషమంగా ఉండడంతో సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Vishnupriya | బెట్టింగ్ యాప్ కేసు.. విష్ణుప్రియ ఫోన్ని సీజ్ చేసిన పంజాగుట్ట పోలీసులు