సంగారెడ్డి/పటాన్చెరు రూరల్, జూన్ 3: సంగారెడ్డి జిల్లాలోని నాలుగు ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్ బృందాల వాహన తనిఖీల్లో పట్టుబడిన మాదక ద్రవాలను ఎక్సైజ్ అధికారులు దహనం చేశారు. మంగళవారం డిస్పోజల్ అధికారి, మెదక్ డిప్యూటీ కమిషనర్ హరికిషన్ ఆధ్వర్యంలో ఇస్నాపూర్ ప్రాంతంలో మెడికేర్ వెస్టేజ్ మేనేజ్మెంట్ ప్రతినిధులు గంజాయి, డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలను కాల్చి బూడిదచేశారు. ఇందులో 209.162 కిలోల గంజాయి, 7 గ్రాముల డైజోఫామ్, 0.496కిలోల ఆల్పాజోలం, 0.468 కిలోల పప్పిస్ట్రా, 3 ఏంఎంసీ, 90.23 కిలోల పదార్థాలను దహనం చేశారు.
జిల్లాలోని పటాన్చెరు స్టేషన్ పరిధిలో 10 కేసులు, సంగారెడ్డి స్టేషన్ పరిధిలో 7 కేసులు, నారాయణఖేడ్ స్టేషన్ పరిధిలో 3కేసులు, అందోల్ స్టేషన్ పరిధిలో 4 కేసుల్లో పట్టుబడిన మాదక ద్రవ్యాలలను అధికారులు ఈ సందర్భంగా కాల్చివేశారు. మత్తు పదార్థాల విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ చంద్ర హెచ్చరించారు.