Patlolla Sashidharreddy | పాపన్నపేట, ఆగస్టు 30 : పాపన్నపేట మండల పరిధిలోని కొత్తపల్లి, యూసఫ్ పేట గ్రామాల మధ్య బ్రిడ్జికి ఇరువైపులా రోడ్డును వెంటనే మరమ్మతు చేయాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం సచివాలయంలో రోడ్లు భవనాల శాఖ ముఖ్య అధికారి వికాస్‌రాజ్‌ను కలిసి విజ్ఞాపన పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పట్లోళ్ల శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. గత మూడు సంవత్సరాల క్రితం ఈ బ్రిడ్జి నిర్మాణం చేశారని.. బ్రిడ్జికి ఇరువైపులా మట్టి రోడ్డు ఏర్పాటు చేసి వదిలి పెట్టారని అన్నారు. ఈ రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలుగా ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నట్లు ఆయన వెల్లడించారు. రోడ్డు గుంతలమయమై ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారని ఈ మేరకు వెంటనే మరమ్మతు చేయాల్సిందిగా కోరారు. నిత్యం ఈ రోడ్డు గుండా ఐదు మండలాల ప్రజలు ప్రయాణిస్తారని అన్నారు.
Harish Rao | పెట్రోల్‌కు రేవంత్ డబ్బులు ఇస్తున్నాడా..? పోలీసులకు హరీశ్‌రావు సూటి ప్రశ్న
పార్టీ మారితేనే సహకారం.. లేదంటే తిరస్కారం..