Harish Rao | సిద్దిపేట అర్బన్ మండలం నాంచారుపల్లి గ్రామంలో పార్టీ కార్యకర్తల కుటుంబాలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పరామర్శించారు. ఇటీవల గ్రామ మాజీ ఎంపీటీసీ రంగం భార్య అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని హరీశ్‌రావు పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ నాయకులు నర్సింహులు ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. అన్ని విధాలా అండగా ఉంటానని భరోసానిచ్చారు. గ్రామంలో మాజీ వార్డ్ సభ్యులు గణేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు హరీశ్‌రావు.
సిద్దిపేట అర్బన్ మండలం నాంచారు పల్లి గ్రామంలో పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే @BRSHarish గారు.
– ఇటీవల గ్రామ మాజీ ఎంపీటీసీ రంగం భార్య అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు..
– గ్రామానికి చెందిన… pic.twitter.com/nSF9S5t4s1
— Office of Harish Rao (@HarishRaoOffice) June 25, 2025