Arogya Advance Policy | చిలిపిచెడ్, సెప్టెంబర్ 24 : ఆరోగ్య అడ్వాన్స్డ్ పాలసీ ప్రతి ఒక్కరు చేసుకోవాలని.. ఈ ఆరోగ్య బీమా కేవలం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (TGB) ఖాతాదారులకు మాత్రమే అతి తక్కువ ప్రీమియంతో అందజేయబడుతుందని చిలిపిచెడ్ మండలం చిట్కుల్ టీజీబీ బ్యాంక్ మేనేజర్ అరవింద్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీజీబీ బ్యాంకులో సభ్యత్వం తీసుకున్న ఖాతాదారులు కుటుంబంలో భర్త, భార్య ఇద్దరు పిల్లల వరకు ఈ పాలసీలో కవర్ చేయబడుతుందన్నారు.
ఫ్లాట్ ప్రీమియంతో కూడిన ఏకైక ఆరోగ్య బీమా ఆరోగ్య అడ్వాన్స్డ్ పాలసీ. బీమా చేయబడిన మొత్తం రూ.5,00,000 – 10,00,000 ఉంటుంది. OPD ఖర్చు ₹3000 వరకు తిరిగి చెల్లించబడుతుంది. వయస్సు 18-55 సంవత్సరాలు (పిల్లల వయస్సు- 3 నెలలు & అంతకంటే ఎక్కువ) 55 సంవత్సరాల వయస్సు వరకు వైద్యం తనిఖీ లేకుండా పాలసీ ఇవ్వబడును. ఇప్పటికే ఉన్న వ్యాధికి 2 సంవత్సరాల తర్వాత వర్తిస్తుంది. 60 రోజుల ముందు ఆసుపత్రి ఖర్చులు, 90 రోజుల తరువాత ఆసుపత్రి ఖర్చులు కవర్ చేయబడుతుంది.
కుటుంబం యజమాని వయసును బట్టి ప్రీమియం నిర్ణయించబడుతుంది. పాలసీ ప్రారంభం మొదటి 30 రోజుల తర్వాత వర్తిస్తుంది. ప్రమాదవశాత్తు జరిగే చికిత్సలకు తక్షణమే చికిత్స లభ్యమవుతుంది. డొమిస్లరీ ట్రీట్మెంట్ అనగా బీమా చేయబడిన వ్యక్తి అనారోగ్యం కారణంగా బయటికి రాలేని పరిస్థితిలో ఇంటి దగ్గరే వైద్యం అందించబడుతుంది (డాక్టర్ సలహా మేరకు) తెలిపారు.
BC Reservations | బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాల్సిందే : ఎమ్మెల్సీ మధుసూదనాచారి
Group-1 | గ్రూప్-1పై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే
Supreme Court | అస్తిత్వ సంక్షోభంలో హిమాలయన్ రాష్ట్రాలు.. కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు