సంగారెడ్డి, ఆగస్టు 1: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ విజయవంతమైనట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆపరేషన్ ముస్కాన్‌తో జిల్లాలో 126 మంది చిన్నారులకు విముక్తి కలిగించి, వారు కోరుకున్న విధంగా తల్లిదండ్రులకు, పాఠశాలలు, సంబంధిత వారసులకు అప్పగించామన్నారు.
బాలలను పనిలో పెట్టుకుని వారి జీవితాలు దుర్భరం చేసిన యాజమాన్యాలపై కేసులు నమోదు చేశామన్నారు. 81మంది యజమానులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నట్లు తెలిపారు. బాలకార్మికులు ఎక్కడైనా కపిపిస్తే చైల్డ్‌లైన్ నంబర్1098కు లేదా 100కు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు.