చిన్నశంకరంపేట, మే 19: మండలంలోని వివిధ గ్రామాల్లో శనివారం రాత్రి బలమైన ఈదురు గాలులు వీచాయి. చందాపూర్ గ్రామ శివారులో ఈదురుగాలికి కరెంటు స్తంభం నేలకూలింది.
మండలంలోని అంబాజిపేట, రుద్రారం, చందంపేట గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. ధాన్యం తడవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.