న్యాల్కల్, అక్టోబర్ 16: శాసన సభ ఎన్నికల బరిలో పోటీచేస్తున్న జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మండలంలోని స్వయంభూవుడిగా వెలిసిన సిద్ధివినాయక ఆలయంలో సోమవారం ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించేలా ఆశీర్వదించాలని మొక్కుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అంతకుముందు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు ఎమ్మెల్యేను సన్మానించారు. మండల పరిధిలోని హుస్సేన్‌నగర్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. పార్టీ మండలాధ్యక్షుడు రవీందర్ ఆధ్వర్యంలో హుస్సేన్‌నగర్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భాజాభజంత్రీల హోరు, పటాకులు కాల్చుతూ ఘనంగా స్వాగతం పలికారు.
ఇంటింటి ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు స్వాగతం పలుకగా, వారిని ఆయన ఆప్యాయంగా పలుకరించారు. ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటర్లను చైతన్య పరుస్తూ మరోసారి ఆశీర్వదించాలని కోరారు. దీంతో ఆయనకు ప్రజల నుంచి వస్తున్న స్పందనతో హుషారుగా బట్టలు ఉతుకుతూ, చిన్నారులకు ఎత్తుకుని, వృద్ధులను కలిసి ఆశీర్వదించాలి అంటూ ప్రచారంలో ముందుకు సాగారు. ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మాణిక్‌రావు భాజాభ జంత్రీలను వాయిస్తూ పార్టీ నాయకుల, కార్యకర్తలను ఉత్సాహపరిచారు. రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, నియోజకవర్గ సమన్వయకర్త దేవీప్రసాద్, రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్ మహ్మద్ తన్వీర్ తదితరులు ప్రచారంలో బీఆర్ఎస్ సంక్షేమ పాలన, మ్యానిఫెస్టో హామీలను ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే మాణిక్‌రావుకు మరోసారి మండలం నుంచి భారీ మెజార్టీని ఇచ్చి గెలిపించుకుంటామని ప్రజలు తెలిపారు.
– రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, నియోజకవర్గ సమన్వయకర్త దేవీప్రసాద్
తెలంగాణలో కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, నియోజకవర్గ సమన్వయకర్త దేవీప్రసాద్ అన్నారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే పార్టీని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనన్నారు. జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యేగా కొనింటి మాణిక్‌రావును మరోసారి భారీ మెజార్టీతో గెలిపించేందుకు మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్ మహ్మద్ తన్వీర్, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఈదులపల్లి శివకుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలను నమ్మితే అధోగతి తప్పదన్నారు.
సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. స్థానికంగా ఉండే జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావును భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ పెంటారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మంకాల్ సుభాశ్, గుండప్ప, మండల ఎంపీపీ వైస్ ఎంపీపీ గౌసోద్దీన్, ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రవికుమార్, సర్పంచులు కుతుబోద్దీన్, మల్లారెడ్డి, అమీర్, మారుతీయాదవ్, రవికుమార్, ఎంపీటీసీలు శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ మండల నాయకులు నర్సింహారెడ్డి, భాస్కర్, బి.చంద్రప్ప, బస్వరాజ్‌పాటిల్, సంగ్రాంపాటిల్, ప్రవీణ్‌కుమార్, నిరంజన్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, అప్పరావుపాటిల్, వెంకట్‌రెడ్డి, తుక్కారెడ్డి, మాణిక్‌రెడ్డి, దేవదాస్, భూమారెడ్డి, హానీఫ్, గౌసోద్దీన్, శ్రీనివాస్, విఠల్, బక్కారెడ్డి, మహేశ్, సంగారెడ్డి, శివస్వామి, సిద్దారెడ్డి, శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.