అభివృద్ధిపై దృష్టి సారించాలి
సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు కలిసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.
- అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలి
- గ్రామాల్లో రోడ్లు, కరెంట్ సమస్యల పరిష్కారానికి కృషి
- నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి
చిలిపిచెడ్, జనవరి 20: సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు కలిసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం చిలిపిచెడ్ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ వినోదాదుర్గారెడ్డి అధ్యక్షతన సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యదర్శులు, ఆయా శాఖల అధికారులతో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2023-24కి అధికారుల సహకారంతో గ్రా మాల అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. చిలిపిచెడ్‌లో కరెంట్ తారువైరు ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు చెప్పినా ఏఈ పట్టించుకోవడంలేని సర్పంచ్ లక్ష్మీదుర్గారెడ్డి ఎమ్మెల్యే దృష్టికి తేవడంతో ఏఈ రాంబాబుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఈ నెల 25వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఏఈని ఎమ్మెల్యే ఆదేశించారు. కరెంట్ 24 గంటలు వస్తుందా? మండలంలో ఎన్ని సబ్స్టేషన్లు ఉన్నా యి? అని ఏఈ రాంబాబును ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. త్వరంలో గంగారం నుంచి ఫైజాబాద్ బీటీ రోడ్డు పనులు చేపట్టాలని పీఆర్ ఏఈ మధుబాబును ఆదేశించారు. సమావేశంలో ఎంపీడీవో శశిప్రభ, ఎంపీవో, ఆయా గ్రామాల సర్పంచులు గోపాల్‌రెడ్డి, పరశురాంరెడ్డి, శంకర్‌నాయక్, యాదగిరి, రాకేశ్‌నాయక్, కవిత, మనోహర, ఇస్తారి, ఎం పీటీసీలు మల్లయ్య, మల్లమ్మ, సుభాష్‌రెడ్డి, ఏపీవో శ్యామ్‌కుమార్, ఏపీఎం ప్రేమలత పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

