రైతులకు మూడు గంటల కరెంట్ ఇస్తే సరిపోతుంది.. 24 గంటల ఉచిత విద్యుత్తు అవసరం లేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో జిల్లాలో రైతన్నల మదిలో ఆగ్రహ జ్వాలలు నెలకొన్నాయి. రైతులను గత ప్రభుత్వాలు ఎనాడూ పట్టించుకోలేదు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తే ఇది గిట్టని కాంగ్రెస్ పార్టీ విషపు ప్రచారం చేస్తోంది. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో జిల్లాలోని అన్ని గ్రామాల్లో రైతులు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు రాస్తారోకో, ధర్నాలు నిర్వహించి దిష్టిబొమ్మలను బుధవారం దహనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కల్పిస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు ఇలాంటి అహంకార ప్రేలాపణలు చేయడం తగదని రైతులు, ప్రజాప్రతినిధులు హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు గ్రామాలకు వస్తే గ్రామ పొలిమేరల్లోనే తరమికొడతామంటూ రైతులు ప్రతిజ్ఞ బూనారు. రేవంత్‌రెడ్డి వెంటనే బేషరతుగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మెదక్‌లో పట్టణ కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
పెద్దశంకరంపేటలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, నర్సాపూర్‌లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు భిక్షపతి ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్ది దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. నిజాంపేట మండల కేంద్రంలో ఎంపీపీ సిద్ధిరాములు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, శివ్వంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణాగౌడ్, అల్లాదుర్గం మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహులు, మాజీ ఎంపీపీ కాశీనాథ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు అంజి యాదవ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు దశరథ్, పీఏసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డి ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. చిలిపిచెడ్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, ఎంపీపీ వినోదాదుర్గారెడ్డి, రామాయంపేట పట్టణంలోని పార్టీ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకులు, అక్కన్నపేట, కాట్రియాల, కోనాపూర్, ఝాన్సీలింగాపూర్, పలు గ్రామాల్లో ఎంపీపీ నార్సింపేట భిక్షపతి ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కొల్చారంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాంపల్లి గౌరీశంకర్, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్‌రావు, నాయకుడు సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించారు.
పాపన్నపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, టేక్మాల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భక్తుల వీరప్ప, ప్రధాన కార్యదర్శి అవినాశ్ ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కౌడిపల్లిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సార రామాగౌడ్, ఎంపీపీ రాజునాయక్, జడ్పీటీసీ కవితా అమర్‌సింగ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ చిన్నచిన్నంరెడ్డి, రేగోడ్ మండల కేంద్రంలో పీఏసీఎస్ చైర్మన్ రాజు యాదవ్, మాజీ అధ్యక్షుడు వినోద్, సర్పంచుల ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. తూప్రాన్‌లో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సతీశ్‌చారి, మున్సిపల్ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, ఎంపీపీ స్వప్నా వెంకటేశ్ యాదవ్, చిన్నశంకరంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పట్లోరి రాజు, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. మెదక్ మున్సిపాలిటీ/ పెద్దశంకరంపేట/ నర్సాపూర్/ నిజాంపేట/ శివ్వంపేట/ అల్లాదుర్గం/ చిలిపిచెడ్/ రామాయంపేట/ కొల్చారం/ పాపన్నపేట/ టేక్మాల్/ కౌడిపల్లి/ రేగోడ్/ తూప్రాన్/ చిన్నశంకంరపేట