పాపన్నపేట, అక్టోబర్ 29: మెదక్ జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని వదలడంతో ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం మళ్లీ మూత పడింది. బుధవారం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఉంచి పూజలు చేశారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఒడిబియ్యం పోసి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు శంకరశర్మ,పార్థీవశర్మ భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఆలయ సిబ్బంది, పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ సేవలందించారు.