అమీన్పూర్, ఫిబ్రవరి 18: విద్యతో ఏదైనా సాధించవచ్చని, నేటి ప్రపంచంలో విద్యకు ఎంతో ప్రాముఖ్యత ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బంధంకొమ్ము కాలనీలో ఎర్ల్ల్లీబడ్జ్ పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువులపై ఉందన్నారు. చదువు మనిషి ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు చిన్నతనం నుంచి ఏకాగ్రతతో విద్యనభ్యసించాలన్నారు.
చిన్నతనం నుంచే లక్ష్యాలను నిర్దేశించుకుని ఆ దిశగా కృషిచేయాలని విద్యార్థులకు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్‌రెడ్డి, అనిల్‌కుమార్, అదర్శ్రెడ్డి, నగేశ్‌యాదవ్, కౌన్సిలర్లు బిజిలి రాజు, చౌటకూరి మహిపాల్‌రెడ్డి, పాఠశాల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.