గుమ్మడిదల,ఫిబ్రవరి19: సంగారెడ్డి జిల్లా నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్యారానగర్ అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ డంపింగ్‌యార్డు ఏర్పాటును నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. గుమ్మడిదలలో రైతు జేఏసీ అధ్యక్షుడు చిమ్ముల జైపాల్‌రెడ్డి, మహిళా జేఏ సీ అధ్యక్షురాలు మల్లమ్మ ఆధ్వర్యంలో బుధవారం జాతీయరహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్‌హెచ్‌పై రైతు జేఏసీ నాయకులు మోకాళ్లపై నిలుచుని అర్ధనగ్న ప్రదర్శన చేశారు. గౌడసంఘం అధ్యక్షుడు అర్జున్‌గౌడ్, రాములు గౌడ్, మాజీ జడ్పీటీసీ కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో గుమ్మిడిదలలో 15వ రోజు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. డంపింగ్‌యార్డు రద్దుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులేనిదే రాజ్యం లేదు.. అంటూ నినాదాలు చేశారు. 15 రోజులు ఆందోళనలు చేస్తుంటే అధికార కాంగ్రెస్ నాయకులు ఎందుకు స్పందించడం లేదని మాజీ జడ్పీటీసీ కుమార్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ నాయకుడు గోవర్ధ్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి మొండిగా వ్యవహరిస్తూ డంపింగ్‌యార్డు ఏర్పాటు చేయిస్తున్నారని, దీంతో తమ గ్రామాలకు ము ప్పు తప్పదని ఆవేదన వ్యక్తం చేశారు. జేఏసీ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. డంపింగ్‌యార్డు ఏర్పాటుతో నర్సాపూర్ రాయచెరువు, వన్యప్రాణులకు ముప్పు ఉందన్నారు. గాలి, నీరు,పర్యావరణ కాలుష్యంతో తీవ్ర నష్టం వాటిళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా జేఏసీ అధ్యక్షురాలు మల్లమ్మ మాట్లాడుతూ.. మహిళలు సైతం రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నా సర్కారు మొద్దునిద్ర వీడడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారుకు రైతులు, మహిళల శాపం తగులుతుందని విమర్శించారు. అనంతరం రిలే నిరాహార దీక్ష కొనసాగడానికి గౌడసంఘం రూ. 10 వేలు రైతు జేఏసీకి విరాళం అందజేసింది. ఆందోళనలో ఆలయ కమిటీ అధ్యక్షుడు మద్దుల బాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్ చిమ్ముల నర్సింహారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మంద భాస్కర్‌రెడ్డి, ఆలేటి శ్రీనివాస్‌రెడ్డి, పలుగు గోవర్ధన్‌రెడ్డి, రాజిరెడ్డి, రాఘవరెడ్డి, రాంరెడ్డి, కరుణాకర్, శ్రీనివాస్‌రెడ్డి, మంగయ్య, బీజేపీ మండల అధ్యక్షుడు ఐలయ్య, పద్మారెడ్డి,తుడుం శ్రీనివాస్, సందీప్‌గౌడ్ పాల్గొన్నారు.
15వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు
ఫ్యారానగర్ డంపింగ్‌యార్డును వ్యతిరేకిస్తూ నల్లవల్లి, కొత్తపల్లి గ్రామాల ప్రజలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. బుధవారం ఈ గ్రామస్తులు ట్రాక్టర్లలో జాతీయరహదారి-765డీ మీదుగా నర్సాపూర్ చేరుకుని హైవేపై భారీ రాస్తారోకో, ధర్నా చేశారు. గంటపాటు ఆందోళనలు చేపట్టడం తో కిలోమీటర్ల మేర ట్రాపిక్ జాం అయ్యింది. త్వరలో ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. ఆందోళనలో కుమ్మరి ఆంజనేయులు, రామకృష్ణ, శ్రీనివాస్, ఫయాజ్ షరీఫ్, కొత్తపల్లి మల్లేశ్‌గౌడ్, సురేశ్, రాజుగౌడ్, రాము, ఆంజనేయులు, రవి, మహేందర్, కొరివి సురేశ్, మాజీ సర్పంచ్ రవి, మహేశ్, పోచయ్య, సత్తయ్య, శివకుమార్ అనిల్, శాంతమ్మ, లక్ష్మి, భారతమ్మ, స్వరూప పాల్గొన్నారు.