దుబ్బాక, ఫిబ్రవరి18: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బుధవారం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ నూతన పాలకవర్గం కలిసింది. ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో కేసీఆర్‌ను వారు మర్యాదపూర్వకంగా కలిశారు. మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్సంగీతారవీందర్, వైస్ చైర్పర్సన్ ఆస సులోచనాస్వామితో పాటు కౌన్సిలర్లను ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి కేసీఆర్‌కు పరిచయం చేశారు.
రెండోసారి దుబ్బాక మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం చేసుకున్నందుకు ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, దుబ్బాక మున్సిపల్ నూతన పాలకవర్గానికి కేసీఆర్ అభినందలు తెలిపారు. నిరంతరం ప్రజలతో మమేకమై దుబ్బాక అభివృద్ధిపైన దృష్టి సారించాలని పాలకవర్గానికి కేసీఆర్ సూచించారు. దుబ్బాకతో తనకు ఉన్నా అనుబంధాన్ని మరోసారి ఆయన గుర్తు చేసుకున్నారు. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌తో పాటు కౌన్సిలర్లు ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం మాజీ మంత్రి , బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌ను కలిశారు. పాలకవర్గానికి హరీశ్‌రావు ప్రత్యేక అభినందనలు తెలిపారు.