చేగుంట, ఏప్రిల్ 28: బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే గిరిజన తండాల్లో అభివృద్ధి జరిగిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం తొల్లపల్లి జేత్రాంతండా నుంచి కొత్తవాల్య తండా వరకు సుమారు రూ. కోటి 93 లక్షల ట్రైబల్ వెల్ఫేర్ నిధులతో మంగళవారం సీసీ రోడ్ల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గిరిజనతండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు.
తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి మౌలిక వసతులు కల్పించారని గుర్తుచేశారు. తండాల్లో సీసీ రోడ్లు, తాగునీరు, మురుగు కాల్వల నిర్మా ణం, విద్యుత్ వంటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ చేగుంట మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, జిల్లా నాయకులు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు రంగయ్యగారి రాజిరెడ్డి, సుభాష్‌రెడ్డి, చేర్యాల మోహన్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ సుభాష్ నాయక్, జనార్దన్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ బింగి గణేశ్, కాశబోయిన సుదర్శన్, పట్నం తానీష, అలీ, ట్రైబల్ వెల్ఫేర్ డీఈ సంపత్‌కుమార్ పాల్గొన్నారు.