IND vs ZIM | వైభవ్, అభిషేక్ ఫ్లాప్.. అర్ధ శతకానికి చేరువైన ఇషాన్..!
IND vs ZIM : ఓపెనర్ అభిషేక్ శర్మ(8) మళ్లీ విఫలమవ్వగా.. తొలి మ్యాచ్‌లో అర్ధ శతకతో కదంతొక్కిన వైభవ్ సూర్యవంశీ(20)లు మెరుపులకు నగవరా తెరదించాడు.
IND vs ZIM : రెండో టీ20లో భారత టాపార్డర్ బ్యాటర్లు త్వరగా పెవిలియన్ చేరారు. ఓపెనర్ అభిషేక్ శర్మ(8) మళ్లీ విఫలమవ్వగా.. తొలి మ్యాచ్‌లో అర్ధ శతకతో కదంతొక్కిన వైభవ్ సూర్యవంశీ(20)లు మెరుపులకు నగవరా తెరదించాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (25) కుదురుకున్నట్టే కనిపించినా బ్రియాన్ బెన్నెట్ ఓవర్లో వెనుదిరిగాడు. దాంతో.. 95కే టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం తిలక్ వర్మ(5 నాటౌట్), ఇషాన్ కిషన్(44 నాటౌట్)లు క్రీజులో ఉన్నారు.
టాస్ ఓడిన భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ(8) ఈసారి కూడా నిరాశపరిచాడు. తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు కొట్టిన అతడిని ముజరబని పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో రెచ్చిపోయిన వైభవ్ సూర్యవంశీ(20) జింబాబ్వే బౌలర్లను భయపెట్టాడు. కానీ, అదే ఊపులో ఆడబోయి అతడు వికెట్ సమర్పించుకున్నాడు.
5⃣0⃣ partnership 🆙
A fluent stand building between Captain Shreyas Iyer and Ishan Kishan 🤜🤛
Updates ▶️ https://t.co/Z8UUziVx8d#TeamIndia | #ZIMvIND pic.twitter.com/IkcC30WV4W
— BCCI (@BCCI) July 25, 2026
ఆతిథ్య జట్టు బౌలర్ల విజృంభణతో 29 కే రెండు వికెట్లు పడిన వేళ.. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(25), ఇషాన్ కిషన్(44 నాటౌట్)లు దూకుడుగా ఆడి స్కోర్‌బోర్డును ఉరికించారు. అయితే.. బెన్నెట్ ఓవర్లో అయ్యర్ ఔటవ్వడంతో ఇషాన్, తిలక్ వర్మ(5 నాటౌట్)లు ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్నారు. 11 ఓవర్లకు భారత జట్టు స్కోర్.. 104-3.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

