కార్యకర్తలు మా బలం అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. పటాన్చెరులో బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉందన్నారు. ఇక్కడ మూడుసార్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచిందన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పార్టీ మారితే పెద్దగా ప్రభా వం ఉండదన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడకుండా ప్రజలకు అందుబాటులో ఉండి వాస్తవాలు తెలియజేయాలన్నారు.
పార్టీ శ్రేణులకు తామంతా అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు. సమావేశంలో మాజీ ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, శంకర్‌యాదవ్, కార్పొరేటర్లు మెట్టు కుమార్‌యాదవ్, సింధూఆదర్శ్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు రోజాబాల్రెడ్డి, లలితాసోమిరెడ్డి, తొంట అంజయ్యయాదవ్, వెంకటేశ్ గౌడ్, గోవర్ధన్‌రెడ్డి, శ్రీధర్‌చారి, కొలన్ బాల్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, చందు ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.