దుబ్బాక, జూలై 28: కాంగ్రెస్‌కు పాలన చేతకాద ని, దేశంలో అత్యంత దౌర్భగ్యమైన సర్కారు ఏదై నా ఉందంటే అది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వమేనని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం దుబ్బాక మండలం పోతారంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి గా విఫలమైందన్నారు. అభివృద్ధి, ప్రజా సంక్షే మం విస్మరించి కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్నదని మండిపడ్డారు. మంత్రులకు తమ శాఖలపై కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్పై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని, హామీలు విస్మరించారని విమర్శించారు. నిధులు లేక గ్రామాల్లో పారిశుధ్యం లోపించిందని, ప్రజ లు అనారోగ్యం బారిన పడుతున్నారని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు.
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆర్టీసీపై కనీసం అవగాహన లేదని, కాలం చెల్లిన బస్సులతో అటు సిబ్బంది, ఇటు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బస్‌లు, సిబ్బంది కొరతతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం సంతోషకరమే కానీ, సరిపడా బస్‌లు లేక విద్యార్థులు, వృద్ధులు ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపా రు. బస్ రూట్లు, బస్‌ల ఏర్పాటుపై మంత్రి పొన్నంకు కనీస అవగాహన లేదన్నారు. ఆయన హుస్నాబాద్‌కే మంత్రిగా వ్యవహరించడం తప్ప రాష్ట్రమంత్రి అనే విషయాన్ని మరిచి పోయాడని ఎద్దేవా చేశారు.
ఇప్పటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆయన ఆర్టీసీపై సమీక్షా సమావేశం నిర్వహించలేదని విమర్శించారు. ఎమ్మెల్యేగా తాను ఇరిగేషన్ మంత్రికి పలుమార్లు మల్లన్నసాగర్ గురించి విన్నవించినా పట్టించుకోలేదని, సాగునీటి సమస్యతో రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోలేని పరిస్థితిలో మంత్రులు ఉండడం బాధాకరం అన్నారు. కాంగ్రెస్ పాలన అంటే కష్టాలకు కేరాఫ్‌గా మారిందని ఎమ్మెలే కొత్త ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. కార్యక్రమంలో దుబ్బాక మాజీ జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఎల్లారెడ్డి, కిషన్‌రెడ్డి,నారాగౌడ్, శ్రీనివాస్, స్వామి, వంశీ, తదితరులు పాల్గొన్నారు.