రాయపోల్ జనవరి 1: కత్తిపోట్లకు గురై ఆపరేషన్ చేసుకొని ఆపదలో ఉన్నప్పటికీ, తన గెలుపు కోసం కృషి చేసిన దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం నూతన సంవత్సరం సందర్భంగా దుబ్బాక మండలం దొమ్మాట చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో లేమని కార్యకర్తలు, ప్రజలు నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదని, తాను నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానన్నారు.
పార్టీలకతీతంగా గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజలు సహకారం అందించాలన్నారు. అనంతరం మసీద్‌లో ముస్లిం పిల్లలతో మాట్లాడి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ పూజితావెంకట్రెడ్డి, ఎంపీటీసీ మోహన్‌రావు, జిల్లా కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ రహీం, ఉమ్మడి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దారా సత్యనారాయణ, బీఆర్ఎస్ నాయకులు నర్ర రాజేందర్, సత్యం, స్టీవెన్రెడ్డి, ఖలీలుద్దీన్ తదితరులు పాల్గొన్నారు