రాయపోల్, మే 15 : దుబ్బాక నియోజకవర్గ ప్రజలే నా బలం, బలగమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నా రు. గురువారం దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామంలో 11 గ్రామలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గానికి అత్యధికంగా నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామన్నారు. ప్రతిపక్షాల బోగస్ మాటలు ప్రజలు నమ్మొద్దని, గత ఉపఎన్నికల్లో బీజేపీకి ప్రజలు ఓటు వేసి మోసపోయారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను నాయకు లు, కార్యకర్తలు ఇంటింటికీ తీసుకెళ్లి వివరించాలన్నారు. రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తప్పుకుండా గుర్తింపు ఉంటుందన్నారు.
కేంద్రం నిధుల కేటాయింపులో వివక్షత చూపుతుందన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వని మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. అభివృద్ధిలో మనమే ఆదర్శంగా ఉన్నామని, మన పథకాలను కేంద్రం కాపీ కొట్టిందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని, రానున్న ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు, రైతులు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. గత ఉపఎన్నికల్లో ఇచ్చిన బీజేపీ ఎమ్మెల్యే ఇచ్చిన వైఫల్యాలను ప్రజల ముందు ఉంచాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అనిత, జడ్పీటీసీ రణం జ్యోతి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మనోహర్‌రావు, వెంకట నర్సింహరెడ్డి, సోలిపేట సతీశ్‌రెడ్డి, మామిడి మోహన్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, ఎంపీటీపీ మల్లేశం, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
దుబ్బాకలో గులాబీ జెండా ఎరగడం ఖాయం
-బీఆర్ఎస్ జిల్లా సమన్వయకర్త బోడెకుంటి వెంకటేశ్వర్లు
ఉద్యమాల గడ్డ దుబ్బా క నియోజకవర్గంలో రాను న్న ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ రాకుండా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలని బీఆర్ఎస్ జిల్లా సమన్వయకర్త బోడెకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. ఉపఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చని ఎమ్మెల్యే ప్రజలను ఎలా ఓట్లు అడుగుతాడని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్‌లు కేవలం ఉనికి కోసం పాటుపడుతున్నాయి తప్ప నిరుపేదలపై చిత్త శుద్ధిలేదన్నారు. సీం కేసీఆర్ రానున్న ఎన్నికల్లో దేశం, రాష్ట్రంలో విజయం సాధించడం ఖాయమన్నారు. ప్రజలకు వద్దకు వెళ్లి ఓట్లు అడిగే హక్కు బీఆర్ఎస్కే ఉం దని, ప్రతిపక్షాలకు ఓట్లు అడిగే నేతిక హక్కులేదన్నారు. రానున్న ఎన్నికల్లో దుబ్బాకలో గులాబీ జెండాను ఎగురవేయడం ఖాయమన్నారు.
కూర్చున్న కొమ్మను ప్రజలు నరుక్కోవద్దు
-ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్
సీఎం కేసీఆర్ ప్రభుత్వ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు పేదలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ అన్నారు. సీఎం కేసీఆర్ సర్కారు పేదలకు ఎంతో సేవ చేస్తుందని, ప్రజలు కూడా కూర్చున్న కొమ్మను నరుకొద్దన్నారు. తనకు దుబ్బాక నియోజకవర్గ ప్రజలతో 30 ఏండ్ల అనుబంధం ఉందన్నారు. ప్రతి కార్యకర్తను కాపాడుకోవాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిని దుబ్బాకలో భారీ మెజార్టీతో గెలిపించి ప్రతిపక్షాలకు గుణపాఠం చెప్పాలన్నారు.